భారత జాతీయగీతం

జనగణమన భారత జాతీయగీతం

జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!

తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
భారత్ మాతా కీ జై

తెలుగు అనువాదం

పంజాబు, సింధు,
గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము
ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము
ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము.
వింధ్య హిమాలయ పర్వతాలు,
యమున గంగలు
పై కంటే ఎగసే సముద్ర తరంగాలు
ఇవన్నీ..
తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి
తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి
తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి
ఓ జనసమూహాల మనసుల అధినాయక.
మీకు జయము!
ఓ భారత భాగ్య విధాత, మీకు జయము!
నిత్య జయము!